వియత్నాం బోటు ప్రమాదం.. HYDకు చేరిన మృతదేహాలు

AP: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ముగ్గురి డెడ్‌బాడీలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను అధికారులు సిద్దం చేశారు. హిందూపురానికి చెందిన నల్లపేట రవితేజ, కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన గెల్లి జయలక్ష్మి డెడ్‌బాడీలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ సంస్థ లావా తమ డిస్ట్రిబ్యూటర్ల కోసం ఏర్పాటు చేసిన వియత్నాం విహారయాత్రలో పడవ బోల్తా పడింది.



