జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టర్ల నిరసన

AP : అమరావతిలో జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పనులు చేసిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బిల్లుల కోసం మంగళగిరిలో నిరసన తెలిపారు. 2024 నవంబర్ నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్‌లో ఉన్న రూ.4,133 కోట్ల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్య తీరేవరకు ఈ ఆందోళనను ఇలాగే కొనసాగిస్తామని అన్నారు.



