ఆటో బోల్తా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన GGC చైర్మన్!

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పొతంగి పంచాయతీ బీజమర గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న GGC చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ వెంటనే స్పందించారు. అంబులెన్స్ ఆలస్యమవడంతో.. తన అనుచరుల సహాయంతో క్షతగాత్రులను అరకులోని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఆయన చొరవను స్థానికులు అభినందించారు.



