కుల వివక్షను అంతం చేయాలి

AP : చిత్తూరు జిల్లాలో కుల వివక్షను అరికట్టి సామాజిక న్యాయం అందించాలని పలమనేరులో నాయకులు ఓబుళరాజు, ఈశ్వర్ డిమాండ్ చేశారు. 'సామాజిక శంఖారావం' కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. దళిత కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటికలు కల్పించాలని కోరారు. భూమిలేని దళిత కుటుంబాలకు రెండెకరాల భూమి ఇవ్వాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలకు రక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.



