← Back to news

ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలి

By Sunke Vinith· 35m ago
ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలి

AP: పరిశ్రమలు ఖాళీ స్థలాలను హరిత వనాలుగా అభివృద్ధి చేసి గ్రీన్‌బెల్ట్‌ను విస్తరించాలని ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు సూచించారు. విశాఖపట్నం జిల్లాలోని దివిస్ పరిశ్రమలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, ప్లాంటేషన్ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. మియావాకి విధానంలో దట్టమైన వనాలను అభివృద్ధి చేయాలని, నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం పరిశ్రమ ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు. పరిశ్రమల పరిసరాల్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని నాగబాబు సూచించారు.

ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలి

More in Local