విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరం 1978వ రోజున ఐద్వా విశాఖ జిల్లా కమిటీ పాల్గొని సంఘీభావం తెలిపింది. ఐద్వా నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రైవేటు స్టీల్ పరిశ్రమలకు భూములు, విద్యుత్, నీరు, పన్ను రాయితీలు కల్పించడం ప్రభుత్వ విధానాల్లోని ద్వంద్వ వైఖరిని చూపుతోందన్నారు. ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు.

