గురుద్వారా వివాదం.. కేజ్రీవాల్‌పై ఫిర్యాదు!

ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారా వివాదం హాట్ టాపిక్‌గా మారింది. CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్ట్‌లో గురుద్వారా ప్రాంగణంలో రాజకీయ నినాదాలు చేసి పవిత్రతకు భంగం కలిగించారని AAP నేతలపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) ఆరోపించింది. ఈ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు AAP నేతలపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఘటనకు సంబంధించిన వీడియోలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశారని కూడా ఆరోపించింది.


