ఫేక్ ST సర్టిఫికెట్లపై NCSTకి ఫిర్యాదు

TG : ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, చింతకాని, తిరుమలాయపాలెం మండలాల్లో కొందరు BC(A) రాజన్న కులానికి చెందిన వారు అక్రమంగా ST (రాజకోయ) సర్టిఫికెట్లు పొంది రిజర్వేషన్లు వాడుకుంటున్నారని ఆదివాసి సంఘాలు ఆరోపించాయి. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్‌కు ఆదివాసి పొలిటికల్ JAC కన్వీనర్ వాసం రామకృష్ణ వినతిపత్రం ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లను రద్దు చేసి, ఇచ్చిన తహసీల్దార్లపై కేసులు పెట్టాలని కోరగా, కమిషన్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.



