బతకాలి అన్న ఆశే నన్ను కాపాడింది

AP: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. తప్పిపోయిన ఆరుగురు జాలర్ల ఆచూకీ ఇంకా దొరకలేదు. కారె చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరోజు భారీ అల మా బోటును ఒక్కసారిగా తాకడంతో బోటు తిరగబడింది. సముద్రంలో చుట్టూ చీకటి, ప్రకృతి వాయుగుండంగా మారడంతో భయమేసిందన్నారు. అయిన వాళ్లు ఒక్కొక్కరుగా కళ్లముందే దూరమైపోతున్నా, బతకాలి అన్న ఆశతో శక్తినంతా పోగుచేసుకుని 9గంటలు ఈదగా ఓ నౌక సిబ్బంది తనను కాపాడారని తెలిపాడు.



