పామాయిల్ గెలల సేకరణపై విచారణ

TG: తెలంగాణలో పామాయిల్ గెలల సేకరణ కేంద్రాల నిర్వహణపై కంప్లయింట్లు రావడంతో ఆయిల్‌ఫెడ్ ప్రత్యేక కమిటీతో విచారణకు ఆదేశించింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని నాలుగు కేంద్రాల్లో మూడు ఒకే ఏజెంట్ అధీనంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సేకరణ, తూకం, ఆన్‌లైన్ నమోదు, రైతులకు చెల్లింపుల్లో తప్పులు జరిగాయా అనే అంశాలను కమిటీ పరిశీలించనుంది. రవాణా ఛార్జీలు టన్నుకు 550 నుంచి 1,300 రూపాయల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఏజెంట్లకు ఇచ్చారనే ఆరోపణలపైనా విచారణ జరగనుంది.
