← Back to news

ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. చెక్‌పోస్టు ఏర్పాటు

By GOLLAPALLI SUDHAKAR RAO· 57m ago· Duttalur, Duttalur, Sri Potti Sriramulu Nellore
ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. చెక్‌పోస్టు ఏర్పాటు

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్ పరిధిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టే లక్ష్యంతో సీతారామపురం సెంటర్ కూడలిలో పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఉదయగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంకమరావు సూచనలతో SI వెంకట రాజేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచుతున్నారు.

More in Local