అప్పులు తీర్చలేక దొంగతనాల బాట

TG: కామారెడ్డిలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విద్యుత్‌నగర్ కాలనీలో నివాసముంటున్న మామిండ్ల లావణ్య ఇంట్లో ఈ నెల 7న దొంగతనం జరిగింది. దుండగుడు 16 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.90వేల నగదును అపహరించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పదంగా పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. విచారణలో అతడు దేవునిపల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్‌గా గుర్తించారు. అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.



