మద్యం మత్తులో హల్‌చల్.. వాహనదారులకు టెన్షన్
AP: విజయనగరం జిల్లా రాజాం అంబేద్కర్ జంక్షన్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వాహనాలకు ఎదురుగా పడుకుని వాటిని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ కానిస్టేబుల్ పరిస్థితిని గమనించి మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లాడు. దీంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.



