చనిపోయినా.. వెలుగునిచ్చిన సిరివెన్నెల

TG: కుమార్తెను కోల్పోయిన విషాదంలోనూ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన కుటుంబం మానవత్వాన్ని చాటుకుంది. కరెంట్ షాక్‌తో పిట్టల సిరివెన్నెల (14) మృతి చెందగా, ఆమె కోరిక మేరకు కళ్లను LV ప్రసాద్ ఐ బ్యాంకుకు దానం చేశారు. ఇంటివద్ద ఉన్న బాలిక విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకుంది. 108 సిబ్బంది సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ‘నేను చనిపోతే నా కళ్లను దానం చేయాలి’ అని బాలిక గతంలో చెప్పిన మాటలను తండ్రి గుర్తుచేశారు. కుమార్తె కోరిక నెరవేర్చిన కుటుంబసభ్యులను పలువురు అభినందించారు.



