శబరిమలలో ప్రసాదం కొరత

శబరిమలలో ఇటీవల జరిగిన నెలవారీ పూజల్లో భక్తులకు అరవణ ప్రసాదం అందలేదు. ఒక్క టిన్ అరవణ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. కొందరు ప్రసాదం లేకుండానే తిరిగి వెళ్లారు. అరవణ తయారు చేసే ప్లాంట్‌ను రిపేర్ల కోసం మూసేశారు. ముందుగా తగినంత స్టాక్ రెడీ చేయకపోవడం, భక్తులు ఎక్కువగా రావడంతో స్టాక్ త్వరగా అయిపోయింది. ప్రస్తుతం నెలవారీ పూజలు ముగియడంతో సమస్య కొంత తగ్గింది. ప్లాంట్ సామర్థ్యం పెంచే పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

