← Back to news

మహిళా కమిషన్‌కి కాంగ్రెస్ కంప్లైంట్!

By Krishna· 1h ago
మహిళా కమిషన్‌కి కాంగ్రెస్ కంప్లైంట్!

TG: తెలంగాణ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు.. BRS ఎమ్మెల్యేలపై మహిళా కమిషన్‌కి కంప్లైంట్ ఇచ్చారు. నిన్న అసెంబ్లీ గేట్ 3 దగ్గర.. BRS ఎమ్మెల్యేలు.. మహిళా పోలీసుల ముందు షర్టులు విప్పారనీ.. దాంతో పోలీసులు తలదించుకోవాల్సి వచ్చిందనీ.. అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు కంప్లైంట్‌లో తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ బీఆర్ఎస్ నేతలు కావాలని అడ్డుకుంటున్నారనీ, ఇలాంటి తీరు మారాలని వారు కోరారు. బీఆర్ఎస్ తీరు ఎంతో బాధాకరం అని వారు అన్నారు.

More in TG