← Back to news

పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

By DK· 30 Jul 2026
పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

TG: సుప్రీంకోర్టు కీలక తీర్పుతో తెలంగాణలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ బ్యారేజీ, డిండి ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియ సుగమమైంది. 2017 నాటి ప్రత్యేక మినహాయింపు నోటిఫికేషన్‌ను సమర్థించిన ధర్మాసనం, భవిష్యత్తులో సాధారణ మినహాయింపులు ఇవ్వకుండా కేంద్రాన్ని ఆదేశించింది. 2021లో జారీచేసిన ఎక్స్‌పోస్ట్ ఫ్యాక్టో అనుమతుల ఆఫీస్ మెమోరాండంను రద్దు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.

More in TG