← Back to news

స్మార్ట్ గ్లాసెస్‌పై నార్వే ఆంక్షలు?

By Anusha· 5h ago
స్మార్ట్ గ్లాసెస్‌పై నార్వే ఆంక్షలు?

స్మార్ట్ గ్లాసెస్‌తో ఇతరులకు తెలియకుండా వీడియోలు, ఆడియో రికార్డ్ చేసే ప్రమాదం ఉందని నార్వే ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే స్కూల్స్, హాస్పిటల్స్, జిమ్స్, పార్కులు, బీచ్‌లలో వీటి వాడకంపై తాత్కాలిక ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. గ్లాసెస్ అమ్మకాలపై నిషేధం లేదు. AIతో ఇతరుల ముఖాలను గుర్తించడం, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం వల్ల ప్రైవసీకి ముప్పు ఉందని అధికారులు భావిస్తున్నారు. రికార్డింగ్ అలర్ట్స్, సేఫ్టీ ఫీచర్స్ మెరుగుపరచాలని సూచిస్తున్నారు.

More in International