← Back to news

ఇస్రోలో రాజీనామాలు.. ఆందోళన అవసరమా?

By siddu vinay· 3 Aug 2026· Youtube
ఇస్రోలో రాజీనామాలు.. ఆందోళన అవసరమా?

ఇటీవల ఓ YouTube ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా. మైల్స్వామి అన్నాదురై, ఇస్రోలో రాజీనామాలను ప్రతికూలంగా చూడొద్దన్నారు. ప్రైవేట్ స్పేస్ కంపెనీలు, స్టార్టప్‌ల పెరుగుదలతో శాస్త్రవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. ఇస్రోలో కఠిన శిక్షణ పొందిన చాలామంది బయటకు వెళ్లి సొంత సంస్థలు స్థాపిస్తూ, అదే నైపుణ్యాన్ని దేశ ప్రైవేట్ స్పేస్ రంగానికి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. దీంతో పోటీ పెరగడమే కాదు, భారత స్పేస్ ఎకోసిస్టమ్ మరింత బలపడుతోందని అన్నారు.

More in Science

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤
Science· 21 Aug 2026

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤

నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కింద పడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడటం చాలామందికి జరుగుతుంది. దీనిని ‘హిప్నిక్ జర్క్’ అంటారు. నిద్రలోకి మారే సమయంలో కండరాలు ఒక్కసారిగా జర్క్ అవడం వల్ల ఈ అనుభూతి వస్తుంది. మనం నిజంగా పడిపోతున్నామని కాదు.. మెదడు, శరీరం మేల్కొనే స్థితి నుంచి నిద్రలోకి మారుతున్న సమయంలో వచ్చే సహజ స్పందన ఇది. ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ కెఫీన్ వంటివి దీన్ని మరింత పెంచొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్‌లో చెప్పండి. 👇