ధాన్యం మాయం.. రైస్ మిల్లు సీజ్
TG: మంచిర్యాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. చెన్నూరు మండలం కత్తరశాల, ఆస్నాద్ గ్రామాల్లోని రెండు రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కత్తరశాలలోని శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్లులో భారీ అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. సుమారు రూ.2 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మిల్లును సీజ్ చేసి, నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.



