విజయవాడ ELSలో ప్రమాదం.. టెక్నిషియన్ మృతి

AP: విజయవాడ ఎలక్ట్రిక్ లోకో షెడ్(ELS)లో ఆదివారం ప్రమాదం జరిగింది. క్రేన్ రిపేర్ వర్క్ చేస్తుండగా 60 అడుగుల ఎత్తు నుంచి జారిపడి టెక్నిషియన్ జ్యోతిబాబు అలియాస్ అయ్యప్ప చనిపోయారు. వెంటనే రైల్వే హాస్పిటల్‌కు తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. సరైన సేఫ్టీ లేకుండానే పని చేయించారని కార్మికులు ఆరోపించారు. దీంతో ELSలో కార్మికులు ఆందోళన చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

