← Back to news

శ్రీనివాస్‌రెడ్డికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్‌ అందజేసిన ఎమ్మెల్యే

By Adithya D· 4d ago
శ్రీనివాస్‌రెడ్డికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్‌ అందజేసిన ఎమ్మెల్యే

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్‌రెడ్డి పరిస్థితిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి సాయం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్వయంగా రూ.3 లక్షల చెక్కును బాధితుడికి అందజేశారు.

More in Local