← Back to news

ముంపు గ్రామాలపై ఎందుకింత నిర్లక్ష్యం: షర్మిల

By dk· 3 Aug 2026
ముంపు గ్రామాలపై ఎందుకింత నిర్లక్ష్యం: షర్మిల

AP: గోదావరి వరదలతో ముంపునకు గురైన ప్రాంతాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని AP కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల విమర్శించారు. ప్రధాని మోదీని పొగడటంలో చూపుతున్న శ్రద్ధ, వరద బాధితులపై లేదని ఫైరయ్యారు. వంద గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం తక్షణ పునరావాసం కల్పించడంలో విఫలమైందన్నారు. బాధితుల కన్నీళ్లు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వరద ప్రభావం తగ్గే వరకు బాధితులకు ఆహారం, వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు అందించాలన్నారు.

More in Politics