← Back to news

క్రైమ్ పారామీటర్లలో రామగుండం పోలీసుల ఉత్తమ ప్రతిభ

By Srikanth· 29 Aug 2026· Ramagundam, Ramagundam, Peddapalli
క్రైమ్ పారామీటర్లలో రామగుండం పోలీసుల ఉత్తమ ప్రతిభ

రాష్ట్రస్థాయిలో క్రైమ్ పారామీటర్ల అమలులో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. క్లస్టర్–II విభాగంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్‌కు డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని డీజీపీ సూచించారు.

More in Local