పవర్ JAC vs యాజమాన్యం: 14 డిమాండ్లు.. 2 వారాల గడువు!

విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ కార్మికులు, పెన్షనర్ల సమస్యలకు పరిష్కారం కోసం.. పవర్ JAC యాజమాన్యంతో మీటింగ్ పెట్టుకుంది. శనివారం హైదరాబాద్‌లోని విద్యుత్ ప్రధాన కార్యాలయంలో GENCO, TRANSCO, SPDCL, NPDCL సంస్థల యాజమాన్యంతో చర్చలు జరిగాయి. మొత్తం 14 ప్రధాన డిమాండ్లు – ఆర్టిజన్ కార్మికుల సమస్యలు, ఉద్యోగుల న్యాయపరమైన కష్టాలు.. వీటన్నింటిపై సుదీర్ఘ చర్చ జరిగింది. యాజమాన్యం స్పందించింది – "రెండు వారాల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటాం" అని హామీ ఇచ్చారు.

