భారత్కు లైన్ క్లియర్: చమురు ఊరట

రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 100% సుంకాలు విధించే ‘లిండ్సే ఓ గ్రాహం చట్టం’ అమలును అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాత్కాలికంగా పక్కనపెట్టడంతో భారత్కు బిగ్ రిలీఫ్ దక్కింది. వెస్ట్ ఆసియా క్రైసిస్, గ్లోబల్ మార్కెట్లో పెరిగిన క్రూడ్ రేట్లు, US మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వల్ల పెట్రోల్ ధరలు పెరగకుండా ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్నారు. దీంతో చైనా తర్వాత రష్యా నుండి భారీగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్న ఇండియాపై టారిఫ్స్ పడతాయన్న ఆందోళనలు పూర్తిగా తొలగిపోయాయి.


