అన్న మృతదేహానికి రాఖీ కట్టి సాగనంపిన చెల్లి

TG : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లి గ్రామంలో జమాల్పూర్ నవీన్ ఎలక్ట్రిక్ వర్క్ చేస్తూ కరెంట్ షాక్‌తో చనిపోయాడు. రాఖీ పౌర్ణమికి అన్నయ్యకు కడదామని చెల్లెలు పూజిత ముందే రాఖీ కొని పెట్టుకుంది. కానీ, పండుగకి రెండు రోజుల ముందే అన్న చనిపోవడంతో కుటుంబం చాలా బాధలో ఉన్నారు. అంతిమయాత్ర టైమ్‌లో ఆ చెల్లి తన అన్నయ్య శవానికి రాఖీ కట్టి, 'ఇదే నేను అన్నకి కట్టే లాస్ట్ రాఖీ' అని ఏడుస్తుంటే అక్కడ ఉన్నవాళ్లంతా కంటతడి పెట్టారు.


