← Back to news

20 ఏళ్ల తర్వాత మళ్లీ రైలు కూత

By శ్రీను· 24 Aug 2026· భద్రాద్రి కొత్తగూడెం

TG : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రైల్వే స్టేషన్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. 20 ఏళ్లుగా ప్యాసింజర్ రైళ్లు ఆగిపోయి, కేవలం బొగ్గు రవాణాకు (గూడ్స్) మాత్రమే వాడుతున్న ఈ ట్రాక్‌పై మళ్లీ ప్రయాణికుల రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ పనులు ప్రారంభించింది. 20 ఏళ్ల తర్వాత తమ ఊరి నుంచి మళ్లీ రైలు ఎక్కవచ్చని ఇల్లందు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు.

More in Local