బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లి..

TG: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది సాయికిరణ్(35) దుబాయ్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. వడియారం గ్రామానికి చెందిన సాయికిరణ్‌కు కొన్నేళ్ల కిందట నాగలక్ష్మీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఉపాధి కోసం గత ఏడాది మే నెలలో సాయికిరణ్ దుబాయ్‌కు వెళ్లాడు. సాయికిరణ్‌కు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మరణించాడు. సాయికిరణ్ మరణవార్త తెలియడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



