← Back to news

మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్

By Krishna· 2h ago
మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్

ఇంటర్నేషనల్‌గా జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతుండటంతో గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. ఇవాళ సెప్టెంబర్ 16న హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు.. 270 రూపాయలు పెరిగి, 1,53,440 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల నగల తయారీ గోల్డ్ 10 గ్రాములు.. 250 రూపాయలు పెరిగి, 1,40,650 రూపాయలుగా ఉంది. సిల్వర్ ధరలో మార్పులేదు. వెండి కేజీ 2,50,000గా ఉంది. ఐతే.. లోకల్ మార్కెట్లలో నగలపై మేకింగ్ ఛార్జీలు, GST విధిస్తారు. అందువల్ల కొనుక్కునే ముందు.. అన్ని ఛార్జీలనూ పరిశీలించుకోండి.

More in Current Affairs

ఏకలవ్య స్కూళ్లలో సమస్యలపై ఆభిజీత్ దీప్కే పిలుపు
Current Affairs· 32m ago

ఏకలవ్య స్కూళ్లలో సమస్యలపై ఆభిజీత్ దీప్కే పిలుపు

ఆదివాసీ పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని <a href="https://x.com/abhijeet_dipke/status/2100137240030494732">CJP ఫౌండర్ ఆభిజీత్ దీప్కే </a>కోరారు. ‘దేశంలో 720 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరైతే.. 477 మాత్రమే పనిచేస్తున్నాయి. 341 స్కూళ్లకే శాశ్వత భవనాలు ఉన్నాయి. 28 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో ST విద్యార్థుల GER 51.9 శాతం ఉండగా, నేషనల్ యావరేజ్ 58.4 శాతం. ఉన్నత విద్యలో ఇది 22.8 శాతానికి పడిపోతోంది' అని అన్నారు. వాలంటీర్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కలిసి ఈ సమస్యపై గొంతెత్తాలి అని ఆయన పిలుపునిచ్చారు.