CJPకి విజయం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం ఫలించింది. యువత చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపారు. తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని, యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నాని ఆ లేఖలో పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.


