← Back to news

పీహెచ్‌సీలో కలెక్టర్ చెక్.. సిబ్బందికి షాక్ ట్రీట్‌మెంట్

By Jelandharkoti Koti· 22 Aug 2026· మంచిర్యాల జిల్లా
పీహెచ్‌సీలో కలెక్టర్ చెక్.. సిబ్బందికి షాక్ ట్రీట్‌మెంట్

TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలపై కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. శుక్రవారం పీహెచ్‌సీని సందర్శించిన ఆయన ఓపీ రిజిస్టర్, వార్డు, ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న గర్భిణుల ప్రసవాల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు సమయపాలన పాటిస్తూ విధులకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.

More in Local