← Back to news

స్ట్రీట్ డాగ్స్‌తో టక్కర్.. 15 మంది కంగారు!

By PAKIRAYYA· 23 Aug 2026· Kaligiri, Kaligiri, Sri Potti Sriramulu Nellore

నెల్లూరు జిల్లా కలిగిరి కుడుములదిన్నెపాడులో ఆదివారం పిచ్చికుక్కల అటాక్‌తో 15 మంది గాయపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన ఎంపీడీవో ప్రత్యూష రెడ్డి, వైద్య బృందంతో స్పాట్‌కి వెళ్లారు. పశుసంవర్ధక శాఖ ద్వారా వీధి కుక్కలన్నిటికీ రేబీస్ వ్యాక్సిన్ వేస్తామని, అనిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం చేపడతామని, చెప్పారు. రోడ్లపై ఆహారం వేయొద్దు, కుక్క కరిస్తే సబ్బు నీటితో కడిగి 24 గంటల్లోపు వైద్య చికిత్స తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇలాంటి ఘటనలు రిపీట్‌కాకుండా ఉండాలంటే పబ్లిక్ కోఆపరేషన్ కీలకం!

More in Local