వేగంగా దూసుకొచ్చిన కారు
TG: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని అనంతారం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతారానికి చెందిన జమాలుద్దీన్ బైక్‌పై వెళ్తుండగా, లక్ష్మాపూర్‌కు చెందిన వ్యక్తి నడుపుతున్న కారు మంగళవారం రాత్రి అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. జమాలుద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సమీపంలోని CCTV కెమెరాల్లో రికార్డవడంతో ఘటన తీవ్రత వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



