← Back to news

పల్లెనిద్ర కార్యక్రమం.. తాడేపల్లిలో పోలీసుల భద్రత!

By BUJJIBABU· 1h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
పల్లెనిద్ర కార్యక్రమం.. తాడేపల్లిలో పోలీసుల భద్రత!

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. గ్రామాల్లో శాంతిభద్రతలు పటిష్టం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఎస్ఐ ఖాజావలి అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో, సీఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది. రాత్రివేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పిస్తున్నారు.ప్రజలకు పోలీసులు చేరువగా ఉండటమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు.

More in Local