← Back to news

PM-కిసాన్ సేవలు సచివాలయాలకు.. అరకులోయలో నిరసన!

By B V Appalanaidu· 54m ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
PM-కిసాన్ సేవలు సచివాలయాలకు.. అరకులోయలో నిరసన!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. రైతులతో కలిసి సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ఎదుట ప్రదర్శన చేపట్టారు. ఈ-కేవైసీ, ఆధార్ లింక్, ల్యాండ్ సీడింగ్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గత్తుం బుజ్జిబాబు తెలిపారు. PM-కిసాన్ సేవలను VAA/VHAలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకరమెట్ట మాజీ సర్పంచ్ గెమ్మెల చిన్నబాబు, కొర్ర చిట్టిబాబు, కిల్లో అప్పారావు, రైతులు పాల్గొన్నారు.

More in Local