భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అవార్డు

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడి చేయడంతో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినా ధైర్యంగా వ్యవహరించి, విమానంలోని 170 మందికి పైగా ప్రయాణికులను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ధైర్యాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిల్ హీరోయిజం’అనే ధైర్యసాహసాలకు ఇచ్చే అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తెలిపారు.


