← Back to news

ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే యుద్ధమే

By Dosawada Adithya· 1h ago· Ranga Reddy
ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే యుద్ధమే

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే యుద్ధమే తప్పదని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ హెచ్చరించారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ కూడలిలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ, హామీలను అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాస్తారోకోతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. కార్యక్రమంలో సీనియర్ నేతలు వి.నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

More in Local