'ఇకిగాయ్'.. తెలుసుకోండి!

Ikigai అనేది జపనీస్ జీవన తత్వశాస్త్రం. దీని అర్థం "జీవించడానికి ఒక కారణం". ప్రతి మనిషికీ ఒక 'ఇకిగాయ్' ఉంటుందనీ, దానిని అన్వేషించి కనుక్కుంటే జీవితం అత్యంత ఆనందమయంగా ఉంటుందని జపనీయులు నమ్ముతారు. ఇకిగాయ్లో 4 అంశాలుంటాయి. 1.మీకు బాగా ఇష్టమైన పని, 2.మీరు అత్యుత్తమంగా చేయగల పని, 3.ప్రపంచానికి అవసరమైనది, 4.మీకు ఆదాయం తెచ్చిపెట్టేది. ఈ నాలుగింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఇకిగాయ్. జపాన్లోని 'ఒకినావా' దీవి ప్రజలు వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడానికి ఈ సూత్రమే ప్రధాన కారణమని చెబుతారు.



