AIతో CCTV వీడియో సృష్టించారన్న పోలీసులు
ఢిల్లీలో పోలీస్ అధికారి మహిళలతో తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు చూపించే ఫేక్ CCTV వీడియోను AI టూల్స్‌తో తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని పోలీసులు తెలిపారు. news_aaina ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వీడియో ప్రచారమైనట్లు గుర్తించి, హర్యానాలోని పల్వాల్‌కు చెందిన 24 ఏళ్ల నదీమ్ అహ్మద్‌ను అక్టోబర్ 5న అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పోలీసుల ప్రతిష్టను దెబ్బతీయడం, ఆందోళనకారులను రెచ్చగొట్టడమే ఉద్దేశమని విచారణలో తేలినట్లు తెలిపారు.
