← Back to news

స్నాప్‌చాట్‌లో పరిచయం.. ఖరీదైన కార్లతో గాలం

By dk· 15 Aug 2026· హైదరాబాద్
స్నాప్‌చాట్‌లో పరిచయం.. ఖరీదైన కార్లతో గాలం

TG: ఖరీదైన కార్లు, లగ్జరీ దుస్తులతో సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి మహిళలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డికి చెందిన సాగర్ చౌదరి అలియాస్ సాయిసునీల్, శివాంగుల భరత్‌కుమార్ స్నాప్‌చాట్ ద్వారా మహిళలకు పరిచయమై వారిని నమ్మించి బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 20మంది మహిళలను మోసం చేసి 40తులాల బంగారం అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆభరణాలను నగల దుకాణాల్లో విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 5h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.