← Back to news

'Monsoon Day' celebrations🌧️☔

By srikanth· 25 Aug 2026· Narsampet
'Monsoon Day' celebrations🌧️☔

TG : వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో 'Monsoon Day' వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. విద్యార్థులు రైన్ కోట్లు వేసుకొని, గొడుగులు పట్టుకుని చినుకుల్లో పాటలు పాడుతూ, ఆడుతూ ఎంజాయ్ చేశారు. కాగితపు పడవలు చేసి నీటిలో వదులుతూ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజా రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి, టీచర్లు పాల్గొన్నారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 23m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.