← Back to news

తక్కువ వోల్టేజ్‌తో ఇబ్బందులు.. అధికారులకు ఫిర్యాదు

By Sunke Vinith· 1h ago
తక్కువ వోల్టేజ్‌తో ఇబ్బందులు.. అధికారులకు ఫిర్యాదు

TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి, గ్రామస్థుడు మాడ దయాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తరచూ విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్ కారణంగా రైతులు, విద్యార్థులు, గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

More in Local