← Back to news

ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలో పడిన లారీ.

By Sharmila· 7h ago

AP:తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. తర్వాత లారీ రోడ్డు పక్కన ఉన్న సుమారు 20 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్పీడ్‌ డ్రైవింగ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ఘాట్ రోడ్లపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

More in AP