రేర్ ట్రిపుల్ స్టార్ సిస్టం.. కనుకున్న సైంటిస్టులు

ఖగోళ శాస్త్రవేత్తలు ఒక అరుదైన ట్రిపుల్ స్టార్ సిస్టంను కనుక్కున్నారు. ఇందులో ఒక వేగంగా తిరిగే పల్సర్, ఒక తెల్ల డ్వార్ఫ్ స్టార్, సూర్యుడిని పోలిన స్టార్ ఉన్నాయి. ఈ వ్యవస్థలోని పల్సర్ PSR J0435+3233.. ప్రతి 3.2 మిల్లీసెకన్లకు ఒకసారి గుండ్రంగా తిరుగుతోంది. ఇది మిల్లీసెకన్ పల్సర్ కుటుంబానికి చెందినది. ఈ పల్సర్ తన భ్రమణ వేగాన్ని సాధారణ మిల్లీసెకన్ పల్సర్ల కంటే సుమారు 100 రెట్లు వేగంగా కోల్పోతోంది. దీనికి బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్నట్లు తెలిసింది.

