అమెరికా ఓటర్లకు ట్రంప్ బంపర్ ఆఫర్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తమ రిపబ్లికన్ పార్టీ గెలిస్తే ప్రతి ఓటరుకూ 5,000 డాలర్లు చెల్లిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతినిధుల సభ, సెనేట్‌పై రిపబ్లికన్ల కంట్రోల్ కొనసాగితే ఈ డాలర్లు అందిస్తామని అన్నారు. దీనిని ‘ట్రంప్ డివిడెండ్’గా చెప్పారు. అయితే ఈ పథకానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం కావడంతో పాటూ, భారీగా నిధులు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. టారిఫ్‌ల ద్వారా వచ్చే రెవెన్యూతో చెల్లింపులు చేపట్టవచ్చని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు.



