కారం పొడి కొనేలోపు రెండు లక్షలు మాయం!

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రెండు లక్షల డబ్బు దొంగతనం కలకలం రేపింది. రషీద్ పటేల్ అనే వ్యక్తి బ్యాంకు నుండి డబ్బు విత్ డ్రా చేసి, తన బైక్ సీటు కవర్‌లో ఉంచారు. దారిలో కారం పొడి కొనేందుకు ఆయన షాపులోకి వెళ్లగా, అతన్ని బ్యాంక్ నుండే కనిపెడుతున్న దొంగ టైమ్ చూసి ఆ డబ్బును ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.



