← Back to news

విరిగిన బస్ స్టీరింగ్ రాడ్.. just miss

By DK· 8 Jun 2026· Dishadaily· కాకినాడ జిల్లా
విరిగిన బస్ స్టీరింగ్ రాడ్..  just  miss

AP: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు సమీపంలో RTC బస్ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయాలైన వారిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Local