← Back to news

జీతాల్లేక పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన

By rajaratnam· 24 Aug 2026· అమరావతి

AP : అమరావతి పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. జూలై నెల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ తుళ్లూరు, వెలగపూడి, రాయపూడితో సహా పలు గ్రామాల్లో నిరసనలు చేపట్టారు. వెలగపూడిలో కార్మికులు వినూత్నంగా భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. నెలలు గడుస్తున్నా జీతాలు రాకపోవడంతో కుటుంబాలు అర్ధాకలితో నరకం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ, సీఆర్‌డీఏ అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జీతాల్లేక పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన

More in Local