← Back to news

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎండిపోతున్న పంటలు

By Sharmila· 1h ago
ఎల్ నినో ఎఫెక్ట్.. ఎండిపోతున్న పంటలు

TG: నల్గొండ జిల్లాలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. సెప్టెంబర్‌ నుంచి ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాలో దాదాపు 80 శాతం పత్తి పంట దెబ్బతినే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. 30 నుంచి 40 శాతం వరకు వరిపంటకు కూడా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. బోర్లు, భూగర్భజలాలపై ఆధారపడిన రైతులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను వేసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు.

More in TG